సన్‌రైజర్స్ టీమ్ నల్ల బ్యాండ్లతో ఎందుకు ఆడిందో తెలుసా?

ముంబై: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ టీమ్ మెంబర్స్ అందరూ చేతులకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఓ కారణం ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు దాడికి నిరసనగా వీళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు. టీమ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కే చెందిన రషీద్ ఖాన్ ఉన్న విషయం తెలిసిందే. టీమ్ మెంబర్స్ అందరూ నల్ల బ్యాండ్లు ధరించి రషీద్‌ఖాన్‌ను గౌరవించారు. దీంతో ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కు థ్యాంక్స్ చెప్పింది.

సన్‌రైజర్స్ టీమ్ తరఫున బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు రషీద్ ఖాన్. ఈ సీజన్‌లోనూ ఆడిన 15 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి క్వాలిఫయర్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అందులో ధోనీ వికెట్ కూడా ఉంది.

Related Stories: