భ్రాంతా లేక నిజమా.. చేతులతో భలే మాయ చేసిందే.. వీడియో

అంతా భ్రాంతి యేన జీవితానా బ్రతుకింతేనా.. అంటూ ఏదో సినిమాల పాడినట్టుగా ఇప్పుడు మనం చూసే ఈ వీడియో కూడా అట్లాగే ఉంటది. అది నిజమా.. లేక భ్రాంతా? అసలు ఇలా కూడా చేయొచ్చా.. ఇంకా మీకు ఎన్నో డౌట్లు వస్తాయి ఈ చేతుల మాయ చూస్తే. సరే.. వీడియో చూస్తారా? తర్వాత మాట్లాడుకుందాం. వీడియో చూశారా? వెంటనే మీరు కూడా ట్రై చేస్తున్నారా? ఆగండాగండి. ముందు మొత్తం చదవండి.. తర్వాత ఆ మాయను మీరు కూడా చేద్దురు కాని. సాధారణంగా సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్‌ను చాలానే చూస్తుంటాం. కానీ.. ఈ తరహా భ్రాంతి అనేది మాత్రం కొత్తగా ఉంది కదా. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ ఆగస్టు 22 న పోస్ట్ చేయగా.. వింతైన ఈ స్టంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు 3.3 మిలియన్ వ్యూస్ ఈ వీడియోకు వచ్చాయి. ఇక.. ఈ వీడియోను చూసిన వాళ్లు ఊరికే ఉంటారా? ఇక.. వాళ్లు కూడా తమకు తోచిన విధంగా ఆ మహిళ చేసిన విధంగా చేయబోయారు. కొంతమంది వాళ్లు ట్రై చేసిన వీడియోలను ట్విట్టర్‌లో షేర్ కూడా చేశారు. ఇలా.. ఆ ఆప్టికల్ ఇల్యూషన్ కాస్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇదివరకు కూడా ఇలాగే ఓ ఫోటో నెటిజన్లను తెగ కన్ఫ్యూజ్ చేసింది. ఓ యువకుడిని యువతి హగ్ చేసుకుంటుంది. కుర్చిలో యువకుడు కూర్చుంటాడు. వెనుక నుంచి వచ్చి ఆ యువతి అతడిని కౌగిలించుకుంటుంది. అయితే.. అది కూడా కొంచెం భ్రమ కల్పించేలా ఉండటంతో నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు. అదే కాదు.. సోషల్ మీడియాలో ఇటువంటివి చాలా వచ్చాయి. కానీ.. దీని తరహా రెస్పాన్స్ మాత్రం దేనికీ రాలేదు.
× RELATED నారాయ‌ణ‌పేట్‌లో ఆధిపత్య పోరు..!