చెక్క పాత్రలపై మరకలు పోవాలంటే..?

ప్రస్తుతం స్టీల్‌కు బదులుగా అందరూ చెక్క పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వంట తర్వాత చెక్క పాత్రలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. మరకలతో కొన్ని అసహ్యంగా కనబడుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ చిట్కాలు ప్రయత్నించండి. * వేడి నీటిలో నిమ్మరసాన్ని కలుపాలి. ఈ మిశ్రమంలో చెక్క పాత్రలను 15 నిమిషాల పాటు డిప్ చేయాలి. తరువాత వేడి నీటితో శుభ్రపరిచిన బట్టతో శుభ్రంగా తుడువాలి. ఎండలో కాసేపు ఆరబెట్టాలి. దీంతో త్వరగా మరకలు తొలిగిపోతాయి. * ఉప్పు నీటిలో శుభ్రం చేయాల్సిన చెక్క పాత్రలను వేసి 5 నిమిషాలు పాటు మరిగించాలి. చెక్క పాత్రలను బట్టతో తుడువాలి. ఆ తరువాత పాత్రలను రోజంతా ఎండనివ్వాలి. * వంటగదిలో ఉపయోగించే చెక్క పాత్రలు వాడిన తరువాత ఎప్పటికప్పుడు వేడినీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల పాత్రలు క్లీన్‌గా ఉంటాయి. * బేకింగ్ సోడా, నిమ్మరసం బాగా కలుపాలి. ఈ పేస్ట్‌ను ఉడెన్ పాత్రలకు ఐప్లె చేయాలి. 15 నిమిషాల తరువాత వేడి నీటితో, తర్వాత చల్లని నీటితో పాత్రలను శుభ్రం చేసుకోవాలి. * వెనిగర్, తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. దూది తీసుకొని ఈ మిశ్రమంలో డిప్ చేయాలి. ఆ దూదితో వంటకు ఉపయోగించే పాత్రలను తుడువాలి. ఇలా తరుచూ చేస్తూ ఉంటే పాత్రలకు అంటిన మరకలు తొలిగిపోతాయి.

× RELATED పూంచ్ సెక్టార్‌ ఆర్మీ క్యాంప్‌లో పేలుడు