ఆర్కిటిక్ అడుగున ఉష్ణ భాండాగారం

వాషింగ్టన్: మంచుఖండం ఆర్కిటిక్ అడుగున ఉన్న భూపొరల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన వేడి పొగలు చిక్కుకొని ఉన్నాయని, అవి బయటికి వస్తే ధ్రువప్రాంతంలోని మంచు మొత్తం కరిగిపోయే ప్రమాదం ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్కిటిక్ దిగువన ఉన్న కెనడియన్ అఖాతంలో గత 30 ఏండ్లలో రెండుసార్లు ఉష్ణప్రవాహాలు కనిపించాయి. అమెరికాలోని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అధ్యయనం చేశారు. వందలాది కిలోమీటర్లు ఎగువన ఉన్న ఆర్కిటిక్ మంచు కింది నుంచి ఈ వేడి నీటి ప్రవాహాలు వస్తున్నట్టు తేల్చారు. దీనిని బట్టి ఆర్కిటిక్ కింద భూ పొరల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు బంధించి ఉన్నాయని నిర్ధారించారు. వీటి ప్రభావంతో మంచు కింది పొరలు కరిగి, ఆ నీరు ఉష్ణప్రవాహాలుగా మారి సముద్రంలో దక్షిణంవైపు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయని చెప్పారు. వీరి పరిశోధన వ్యాసం సైన్స్ అడ్వాంటేజెస్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Related Stories: