జూ. పంచాయతీ కార్యదర్శుల దరఖాస్తు గడువు పెంపు

ఈ నెల 15 వరకు అవకాశం.. రుసుం చెల్లింపునకు 14వ తేదీ ఆఖరు అక్టోబర్ 4న పరీక్ష నిర్వహణ హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు గడువును పెంచుతూ పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయం తీసుకున్నది. రాత పరీక్ష తేదీల్లోనూ మార్పులు చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు బుధవారంతో ముగియాల్సి ఉండగా.. ఈ నెల 15 వరకు పొడిగించారు. ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 14 వరకు పెంచారు. ఈ నెల 14లోగా ఫీజు చెల్లించిన అభ్యర్థులు 15 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొనేలా మార్పులు చేశారు. సర్వర్‌లో ఏర్పడిన ఇబ్బందులతో చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అభ్యర్థులు ఈ విషయాన్ని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమీక్షించిన మంత్రి జూపల్లి దరఖాస్తు గడువు పెంచాలని సూచించగా, ఈ మేరకు పంచాయతీ కార్యదర్శుల నియామకపు ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రాత పరీక్ష తేదీల్లోనూ మార్పు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక రాత పరీక్ష అక్టోబర్ 4న నిర్వహించనున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. పరీక్షను ఈ నెల 28న నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసినా.. దరఖాస్తు చేసుకొనేందుకు గడువు పెంచడం, సాంకేతిక కారణాలతో పరీక్ష తేదీని అక్టోబర్ 4కు మార్చినట్టు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
× RELATED 16 మంది సీఎంలు పాలించినా అభివృద్ధి శూన్యం