ఆస‌క్తి రేపుతున్న 'ది ఫాగ్'ట్రైల‌ర్‌

కొన్ని ట్రైల‌ర్స్ చూస్తుంటే సినిమాపై బోలెడ‌న్ని అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం. ఎన్నో ట్విస్ట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి ఆస‌క్తి క‌లిగించేలా ద‌ర్శ‌కుడు ఆ ట్రైల‌ర్ క‌ట్ చేసి రిలీజ్ చేస్తాడు. తాజాగా విడుద‌లైన ది ఫాగ్ ట్రైల‌ర్ కూడా అభిమానుల‌లో ఎంతో ఆస‌క్తి రేపుతుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్‌లో ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఫింగర్‌ ప్రింట్స్‌ తాజాగా హత్యకు గురైన వారి శరీరాలపై ఉండడం చూపించారు. అంతేకాదు వేడిపుట్టించే ముద్దులు, యూత్‌కి కావ‌ల‌సిన అన్ని మ‌సాలాల‌ని ద‌ట్టించి ట్రైల‌ర్ వ‌దిలారు. ట్రైల‌ర్‌ని చూస్తుంటే సినిమాపై బోలెడ‌న్ని అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఎంవీ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విరాట్ చంద్ర‌, చంద‌న‌, హ‌రిణి హీరోహీరోయిన్స్‌ఘా న‌టిస్తున్నారు. మ్యాజిక్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై మధుసూదన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. కొత్త టెక్నాలజీతో సినిమాని తెర‌కెక్కించార‌ని తెలుస్తుండ‌గా, సందీప్ చిత్రానికి సంగీతం అందించారు.

Related Stories: