ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కలిశారు. ఐఆర్‌ను వెంటనే ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల కీలక డిమాండ్లలో నెరవేరని అంశాలపై దృష్టిసారించాలని కోరినట్టు వారు తెలిపారు. మంగళవారం ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహిస్తున్నట్టు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు.