నామినేషన్ వేస్తే అభ్యర్థుల ఖర్చు మొదలైనట్లే: ఈసీ

హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నామినేషన్లను పనిదినాల్లో స్వీకరిస్తామన్నారు. 102 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 35 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అభ్యర్థుల ఖర్చులు ఇప్పటి నుంచి లెక్కలోకి వస్తాయి. స్టార్ క్యాంపెనర్ల పేర్లు 7 రోజుల్లో ఇవ్వాలి. లేదంటే ఖర్చు అంతా అభ్యర్థికి చెందినదిగా పరిగణిస్తాం. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మిగితా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రూ.77.62 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 2.63 కోట్ల లీటర్ల మధ్య స్వాధీనం చేసుకున్నాం. అక్రమంగా నిర్వహిస్తున్న 4,038 మద్యం దుకాణాలు మూసివేశాం. సి-విజల్ యాప్‌కు ఇప్పటి వరకు 2251 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులో 81 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

Related Stories: