రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గ భేటీకి కేటీఆర్, మహేందర్‌రెడ్డి మినహా మిగతా మంత్రులు హాజరయ్యారు. సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. గతంలో కొన్ని శాఖలు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఐఆర్, ఉద్యోగాల భర్తీతో పాటు పలు సంక్షేమ పథకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం నేరుగా సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభకు బయల్దేరనున్నారు.

Related Stories: