తెలంగాణ విద్యుత్ రంగానికి స్కోచ్ అవార్డు

హైదరాబాద్: విద్యుత్ రంగంలో ఎనలేని ప్రగతి సాధించినందుకు జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యుత్ రంగానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. స్కోచ్ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చార్ చేతుల మీదుగా ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి, ఇంజినీర్లు హనుమాన్, శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. దేశంలోనే తెలంగాణ విద్యుత్ సరఫరాలో నెంబర్ వన్ అని స్కోచ్ అవార్డు నిరూపించిందని ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, సీఎండీ ప్రభాకర్ రావు ఆలోచనలతో అవార్డు సాధించగలిగామన్న ఆయన.. రాష్ట్రం ఏర్పడ్డ ఒకటిన్నర సంవత్సరంలోనే 9 గంటల విద్యుత్ అందించామన్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. లోటు విద్యుత్ నుంచి విద్యుత్ కష్టాలను అధిగమించిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.

Related Stories: