32,796కు చేరుకున్న తెలంగాణ పోలింగ్ కేంద్రాలు

హైదరాబాద్: రాష్ట్రంలో 222 అనుబంధ పోలింగ్ కేంద్రాలకు అనుమతి అభించింది. ఓటర్ల సంఖ్య పెరగడంతో అనుబంధ కేంద్రాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అనుబంధ కేంద్రాలతో 32,796లకు పోలింగ్ కేంద్రాల సంఖ్య చేరుకుంది. మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో 65 అనుంబధ కేంద్రాలు, హైదరాబాద్‌లో అదనంగా 40 పోలింగ్ కేంద్రాలు, నిజామాబాద్ జిల్లాలో అదనంగా 32 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. పెరిగిన పోలింగ్ కేంద్రాలతో హైదరాబాద్‌లో అత్యధికంగా 3866 పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది. రంగారెడ్డి -3090, మేడ్చల్ మల్కాజ్‌గిరి -2175 పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది.

Related Stories: