పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్: 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన విధి విధానాలకు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం పోస్టుల్లో మహిళలకు 3158 పోస్టులు రిజర్వ్ చేశారు. జిల్లాల వారిగా ఖాళీలను ప్రకటించారు. జిల్లాల వారిగా రిజర్వేషన్‌లతో పోస్టుల సంఖ్యను తెలిపారు. పరీక్ష విధానం, పూర్తి వివరాలను ప్రభుత్వం వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఉంటుందని తెలిపారు.

Related Stories: