తెలంగాణ దేవుడు గీతాలు

శ్రీకాంత్, జిషాన్‌ఉస్మాన్, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తెలంగాణ దేవుడు. హరీష్ వడ్‌త్యా దర్శకుడు. మ్యాక్ ల్యాబ్స్ పతాకంపై మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గీతాలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. హీరో శ్రీకాంత్, నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నేను ఎన్నో కష్టాలు పడి దర్శకుడిగా ఎదిగాను. ఈ సినిమా వ్యయం విషయంలో నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. స్ఫూర్తిదాయక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అన్నారు. కథానుగుణంగా అద్భుతమైన పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు నందన్ తెలిపారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ దర్శకుడు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు చేయాలా? వద్దా? అని ఆలోచించాను. కథలోని భావోద్వేగాలు నచ్చి అంగీకరించాను. ఒక గొప్ప నాయకుడి పాత్రను పోషించడం గర్వంగా ఉంది. సినిమాలోని ప్రతీ క్యారెక్టర్‌ను బాగా తీర్చిదిద్దారు. ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఈ సినిమా చేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్, బ్రహ్మానందం, అలీ, అజయ్, వెంకట్, రవికుమార్‌చౌదరి, డి.ఎస్.రావు, కందికొండ తదితరులు పాల్గొన్నారు.