ప్రతీ పౌరునికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలి: సీఎం కేసీఆర్

మెదక్: మెదక్ జిల్లా చేస్తానన్న వాగ్దానం నిలుపుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగిస్తూ..తెలంగాణ సాధిస్తామన్న నాడు ఎవరూ నమ్మలేదు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చుకున్నం. తెలంగాణలో చంద్రబాబు పెత్తనం అవసరం లేదని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ తర్వాత పూర్తి కాబోతుంది. కాళేశ్వరం నీళ్లతో మంజీరా, హల్దీవాగు ఎండిపోవు. రెప్పపాటు కూడా పోకుండా నిరంతరం కరెంట్ ఇస్తున్నం. రైతులందరికీ గిట్టుబాటు ధర వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. మెదక్ అభివృద్ధి పనులు చేయించే బాధ్యత నాది. మెదక్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు వస్తాయి. పేదలకు ఉచితంగా వైద్యం అందేలా కార్యక్రమం రూపొందిస్తం. రాష్ట్రంలో అదనంగా కోటి 20 లక్షల గొర్రెలు తయారైనయి. క్రమశిక్షణతో పనిచేసి సంపద పెంచుతున్నం.

పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ.9 కోట్ల 56 లక్షలు. ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగేళ్లలో వచ్చిన ఆదాయం రూ.2వేల 57 కోట్లు అని సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నం. తెలంగాణలో ప్రతీ పౌరునికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందేలా కార్యక్రమం రూపొందిస్తమని సీఎం చెప్పారు. కంటి వెలుగు తర్వాత ఈఎన్ పరీక్షలు చేయిస్తమని అన్నారు. మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Related Stories: