రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, చందూలాల్, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
× RELATED 25 ఏండ్ల తర్వాత రేప్ కేసు నిందితుడు అరెస్ట్