ఇప్పటివరకు 1,497 నామినేషన్లు దాఖలు

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు సోమవారంతో గడువు ముగియనున్నది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు మాత్రమే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 119 సెగ్మెంట్లలో అన్ని పార్టీలు, స్వతంత్ర, తిరుగుబాటు అభ్యర్థులు కలిసి 1,497 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో రెబల్స్, స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య 870, వివిధ పార్టీలకు చెందిన వారు 627 మంది ఉన్నారు. అయితే పార్టీల నుంచి బరిలోకి దిగిన కొంతమంది ఒక్కొక్కరు నాలుగు సెట్లవరకు దాఖలు చేశారు. దీంతో ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఆదివారం ఆయా పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు సోమవారం నామినేషన్ వేస్తారు. చివరి రోజుకావటంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నది. అభ్యర్థులు గడువు ముగిసేలోగా బీఫారాలు కూడా సమర్పించాల్సి ఉండటంతో అన్ని పార్టీలు ఆదివారం పెద్ద ఎత్తున తమ అభ్యర్థులకు బీఫామ్స్ అందించాయి.

Related Stories: