తెలంగాణ, హర్యానా పెయింటింగ్స్ ఎగ్జిబిషన్

హైదరాబాద్: ఏక్‌భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి హైదరాబాద్ టూరిజం హోటల్ ప్లాజాలో తెలంగాణ, హర్యానా రాష్ర్టాల పెయింటింగ్స్, ఫొటోల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఇది రెండురోజులపాటు కొనసాగుతుంది. ఏక్‌భారత్, శ్రేష్ఠ్ భారత్‌లో భాగంగా ఇటీవల హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో నిర్వహించిన ప్రదర్శనల్లో తెలంగాణ కళాకారులు ఆకట్టుకొని ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ కళాకారులు త్వరలో హర్యానాలో పర్యటించనున్నారు.

Related Stories: