ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ రూమ‌ర్ అంటున్న తేజ‌ !

నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న తేజని ప‌లు ఆఫ‌ర్స్ ప‌లుక‌రించాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో పాటు వెంకటేష్ ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా తెర‌కెక్కించే అవ‌కాశం ల‌భించింది. కాని ఈ రెండు ప్రాజెక్ట్స్ మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. ఇక రీసెంట్‌గా ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌ని తేజ తెర‌కెక్కించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ‘నువ్వునేను’ సినిమాతో ఉద‌య్ కిర‌ణ్‌ని తెలుగు తెర‌కి ప‌రిచ‌యం చేసిన తేజ ఆయ‌న జీవితంలో మంచీచెడులు, ఎత్తుపల్లాలు, జయాపజయాలను దగ్గరి నుంచి చూశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జీవితంపై బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని అన్నారు. ఉద‌య్ బ‌యోపిక్‌కి ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు గత రెండు మూడు రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై తేజ ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌తో మాట్లాడుతూ.. ఇదంతా రూమ‌ర్ అని ఖండించాడ‌ట‌. ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ చేసే ఆలోచ‌న త‌న‌కి లేద‌ని చెప్పిన తేజ‌, ఈ రూమ‌ర్ ఎక్క‌డి నుండి వ‌చ్చిందో తెలియ‌డం లేద‌ని అన్నారు. త‌న త‌ర్వాతి చిత్రం పూర్తి యాక్ష‌న్‌గా ఉంటుంద‌ని చెప్పుకొచ్చిన తేజ ఇందులో ద‌గ్గుబాటి రానా హీరోగా న‌టించే అవ‌కాశం ఉంద‌ని హింట్ ఇచ్చారు. తేజ క్లారిటీతో ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్స్‌కి సంబంధించిన రూమర్స్‌కి బ్రేక్ ప‌డింది. అయితే సౌంద‌ర్య బ‌యోపిక్‌కి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు రాగా, దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Related Stories: