నాకు కొంచెం షార్ట్ టెంపర్..

ఇటీవలే తేజ్..ఐ లవ్ యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్ చాట్ లో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది అనుపమ. కాలేజ్ డేస్‌లో స్నేహితులతో కలిసి రోడ్‌పై నడుచుకుంటూ భేల్‌పూరి, ఐస్‌క్రీమ్స్ తినేదాన్ని. అందరం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛ దూరమైంది. విదేశాలకు వెళితే తప్ప రోడ్లపై తిరగడానికి అవకాశం ఉండదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరితో ఈజీగా కలిసిపోతాను. ఎవరి దగ్గరైనా నా అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తాను. ఇష్టపడిన దాని కోసం కష్టపడేతత్వం ఎక్కువ. నా సక్సెస్‌కు ఇవే కారణాలని భావిస్తాను. ఇక స్వతాహాగా నాకు కొంచెం షార్ట్‌టెంపర్. ఆ లక్షణాన్ని మార్చుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

Related Stories: