ఫైట్ మాస్ట‌ర్స్‌తో సుకుమార్ తీన్‌మార్ స్టెప్స్ అదుర్స్‌

లెక్కల మాస్టారు సుకుమార్ తెర‌కెక్కించే సినిమాలు ఎంత ఇంటెలిజెంట్‌గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో రంగ‌స్థ‌లం అనే సినిమా చేస్తున్నాడు సుక్కూ. స‌మంత ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప‌ల్లెటూరి నేప‌ధ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో చ‌ర‌ణ్ చెవిటి వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడు. రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది మెగా ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ అందించింది. మార్చ్ 30న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాల‌ని హైద్రాబాద్ లోని స్టూడియోస్ లో సెట్స్ వేసి మరీ చిత్రీకరణ చేస్తున్నారు. అలాగే కొన్ని రియల్ లొకేషన్స్ లో కూడా చిత్రీకరణ జరుగుతోంది. అయితే రంగస్థలం షూటింగ్ స్పాట్ లో సుకుమార్, ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్‌లు తీన్ మార్ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్న ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ గ్యాప్ లో ఈ డ్యాన్సింగ్ ఎపిసోడ్ జరిగిందట. మ‌రి మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

Related Stories: