2.ఓ టీజ‌ర్‌కి టైం ఫిక్స్..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 2.ఓ. అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా 450 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వంబ‌ర్ 29న చిత్ర విడుద‌ల‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే మూవీకి సంబంధించి కేవ‌లం పోస్ట‌ర్స్ మాత్ర‌మే విడుద‌ల కాగా, ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయ‌లేదు. దీంతో అభిమానులు టీజ‌ర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆగస్టు 15న ‘రోబో 2.ఓ’ తొలి టీజర్‌ని బ‌య‌ట‌కి తీసుకు రావాల‌ని శంక‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. టీజ‌ర్ రిలీజ్ త‌రువాత ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేసి సినిమాని జ‌నాల‌లోకి మ‌రింత‌గా తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నాడ‌ట‌. హాలీవుడ్ రేంజ్‌లో మూవీ తెర‌కెక్కిన‌ట్టు చెబుతుండ‌గా, ఇందులోని స‌న్నివేశాలు ఆడియ‌న్స్ రోమాలు నిక్క‌పొడ‌చుకునేలా చేస్తాయ‌ని టీం స‌భ్యులు అంటున్నారు. ప్ర‌తినాయ‌క పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ న‌టించ‌గా, క‌థానాయిక‌గా అమీ జాక్స‌న్ నటించింది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం చిత్రానికి చాలా ప్ల‌స్ అవుతుంద‌ని అంటున్నారు.

Related Stories: