ఓడినా టాప్‌లోనే కోహ్లి సేన

దుబాయ్: ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 1-4తో కోల్పోయినా.. టీమిండియా మాత్రం టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నది. అయితే సిరీస్ ఓటమితో పది పాయింట్లు కోల్పోయింది. సిరీస్‌కు ముందు 125 పాయింట్లతో టాప్‌లో ఉన్న కోహ్లి సేన ఖాతాలో ప్రస్తుతం 115 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఈ విజయంతో నాలుగోస్థానానికి దూసుకొచ్చింది. చివరి టెస్ట్‌లో 118 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్.. న్యూజిలాండ్ నుంచి వెనక్కి నెట్టి ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చింది. ఈ సిరీస్ విజయంతో ఇంగ్లండ్ ఖాతాలో 8 పాయింట్లు వచ్చి చేరాయి. 106 పాయింట్లతో రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాల కంటే కేవలం ఒక పాయింట్ మాత్రం ఇంగ్లండ్ వెనుకబడి ఉంది. ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కేవలం ఐదు పాయింట్ల తేడాలో నాలుగు టీమ్స్ ఉండటం విశేషం.
× RELATED కివీస్ కెప్టెన్ ఒంట‌రి పోరాటం