రైలులో టీ, కాఫీకి ఇక ఎక్కువ చెల్లించాలి..

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులు ఇప్పటి నుంచి టీ, కాఫీకి ఎక్కువ ధర చెల్లించాలి. రైల్వే ప్రయాణికులకు ఇప్పటిదాకా రూ.7కు అందిస్తున్న టీ ధరను రూ.10కి పెంచింది ఐఆర్‌సీటీసీ. అయితే ధరలు పెరిగినప్పటికీ సాధారణ టీ ధర 5 రూపాయలకే లభించనుందని ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. లైసెన్స్ ఫీజు మార్పుల నేపథ్యంలో టీ ధరలు పెరిగాయని ఐఆర్‌సీటీసీ అధికారులు పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీ సుమారు 350 రైళ్లలో సేవలను అందిస్తోంది. రాజధాని, శతాబ్ధి రైళ్లలో ఈ మార్పులు Gవర్తించవు.

Related Stories: