కంచికచర్లలో తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం

కృష్ణా: ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్లలో తెలుగు తమ్ముళ్లు అత్యత్సాహం ప్రదర్శించారు. సినీనటుడు బాలకృష్ణ కొడుకు పుట్టిన రోజంటూ ఇంజినీరింగ్ కాలేజీలో హల్‌చల్ చేశారు. అనుమతి లేకుండి అమృత సాయి ఇంజినీరింగ్ కాలేజీలో హడావుడి చేశారు. మద్యం తాగి సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారు. అనంతరం కాలేజీలో బైకులు, కార్లతో రౌండ్లు వేసి విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేశారు. కాలేజీకి చెందిన పలు ప్రాపర్టీలను కూడా ధ్వంసం చేశారు. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య