పొత్తులపై బాబుదే తుది నిర్ణయం : లంక దినకర్

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తాయని వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ స్పందించారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు వెలువడుతున్నాయని దినకర్ తెలిపారు. పొత్తుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఉత్సాహం చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చారని.. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరుపుతారని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబే పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటారని దినకర్ స్పష్టం చేశారు.
× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం