టీఆర్ఎస్ లోకి 100 మంది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

కొంగరకలాన్ : టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య సమక్షంలో శంకర్ పల్లి మండలం ఎల్వర్తీకి చెందిన 100 మంది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు స్వచ్ఛందగా కలిసి వచ్చి పార్టీలో చేరారు. మంత్రి మహేందర్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రతి పక్షాల అడ్రస్ గల్లంతవుతుందని చెప్పారు.

× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..