ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపిన టీబీజీకేఎస్ ప్రతినిధులు

నిజామాబాద్: ఎంపీ కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతాభివందనాలు వెల్లువెత్తాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు ఇవాళ హైదరాబాద్ లోని ఎంపీ కవిత నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS), తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నేతలు(TRKVS), సెకండ్ ఎంఎన్ఎంలు, ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ కమ్యూనిటీ ఆర్గనైజర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్న నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డి, సమన్వయకర్త గోపాల్ రావు ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. సెకండ్ ఎంఎన్ఎంలకు 13 వేల 232 రూపాయల నుంచి 21 వేలకు వేతనం పెరిగింది. ఎంపీ కవిత కృషి వల్లే వేతనాలు పెరిగాయని తెలంగాణ రెండవ ఏఎన్ఎం సంఘం అధ్యక్షురాలు అనురాధ ప్రధాన కార్యదర్శి తారా దేవి తెలిపారు. ఆరు వేల రూపాయల వేతనాన్ని పొందుతున్న ఆశా వర్కర్లుకు రూ. 1500 రూపాయలు వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఆ సంఘం అధ్యక్షురాలు కాసు మాధవి, ప్రధాన కార్యదర్శి సంతోష నేతృత్వంలో ఆశా వర్కర్లు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ కమ్యూనిటీ ఆర్గనైజర్లు సంఘం అధ్యక్షుడు సాయి నేతృత్వంలో కార్మికులు ఎంపీ కవితని కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఎంపీడీవోల సంఘం నేతలు కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీవోల ప్రమోషన్ల ఫైలుపై సీఎం కేసిఆర్ సోమవారం సంతకం చేసిన విషయం తెలిసిందే. ఎంపీ కవితను కలిసిన వారిలో ఎంపీడీవోల సంఘం అధ్యక్షులు రాఘవేందర్ రావు, నాయకులు శ్రీనివాస రావు, శ్రీధర్, శ్రవణ్ కుమార్, దిలీప్ కుమార్, శ్రీనాథ్ రావు, భగవాన్ రెడ్డిలు ఉన్నారు. అలాగే.. గ్రామ పంచాయతీ సంఘం అధ్యక్షులు నరసింహ, ప్రధాన కార్యదర్శి యజ్ఞ నారాయణ, అంగన్వాడీ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు భారతి, ప్రధాన కార్యదర్శి రాణి, మినీ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మి, వీఆర్ఏ సంఘం నాయకులు రాజయ్య డైరెక్టర్ రిక్రూట్మెంట్ నాయకులు ఈశ్వర్, రమేష్, సీపీడబ్ల్యూ నాయకులు రవి, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లోని ఎంఓఎమ్ కాంట్రాక్టు ఉద్యోగులు, 108 ఉద్యోగులు, బీడీ టీకే దారుల సంఘం నాయకులు ఎంపీ కవితని కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం టీఆర్ఎస్కేవి అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఆర్ఎస్ కార్యదర్శి రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
× RELATED నామినేషన్ల చివరి రోజు కూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్