మార్కెట్లోకి టాటా టియాగో ఎన్‌ఆర్‌జీ.. ధర రూ.5.50 లక్షలు..

టియాగో ఎన్‌ఆర్‌జీ పేరిట టాటా మోటార్స్ మరో నూతన కారును మార్కెట్‌లోకి ఇవాళ ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.5.50 లక్షలు ఉండగా, టాప్ వేరియెంట్ ధర రూ.6.32 లక్షలుగా నిర్ణయించారు. కాగా ఈ కారు మారుతి సుజుకి సెలెరియో ఎక్స్‌కు పోటీనిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారులో బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను కార్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కారులో రియర్ పార్కింగ్ సెన్సార్లను ఏర్పాటు చేశారు.

టాటా టియాగో ఎన్‌ఆర్‌జీ పెట్రోల్, డీజిల్ వేరియెంట్లలో వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 1.2 లీటర్ త్రీ సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 84 బేసిక్ హార్స్ పవర్‌ను కలిగి ఉంది. ఇక డీజిల్ వెర్షన్ ఇంజిన్ కెపాసిటీ 1.05 లీటర్లు. ఇది 69 బీహెచ్‌పీని కలిగి ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను రెండు ఇంజిన్లలోనూ ఏర్పాటు చేశారు.

Related Stories: