ఆటా తెలంగాణ ఆధ్వ‌ర్యంలో స్వామిగౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

అమెరికా : అమెరిక‌న్ తెలంగాణ అసోసియేష‌న్(ఆటా తెలంగాణ) ఆధ్వ‌ర్యంలో శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈనెల 8 నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఆటా ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున్న ప్ర‌థ‌మ తెలంగాణ ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు చైర్మ‌న్ స్వామిగౌడ్ అమెరికా వెళ్లారు. ఈ సంద‌ర్భంగా జూలై 6వ తేదీన ఆయ‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆటా తెలంగాణ వేడుక‌లు జ‌రిపింది. స్వామి గౌడ్ పుట్టిన రోజు వేడుకల్లో ఆటా చైర్మ‌న్ రాంమోహ‌న్ రెడ్డి కొండా,ఆటా క‌న్వీన‌ర్ వినోద్ కుకునూర్‌, బోర్డ్ ఆఫ్ ట్ర‌స్టీ వెంక‌ట్ మంతెన‌, ప్ర‌తినిధులు విష్ణు మాధ‌వ‌రం, స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి కందిమ‌ల్ల‌, క‌రుణాక‌ర్ మాధ‌వ‌రం, న‌రేంద‌ర్ చీమ‌ర్ల‌, క‌ళ్యాణ్ ఆర్ ఆనందుల‌, వెంక‌ట్ ఎక్కా, ర‌వి ఉపాడ్ తదిత‌రులు పాల్గొన్నారు.

Related Stories: