ఎంపీడీవోతో పాటు ఇద్దరు అధికారులను సస్పెన్షన్

కామారెడ్డి : హరితాహారం 2017-18 సంవత్సరంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్,కుప్రియాల్ గ్రామాల నర్సరీలకు సంబంధించి నిధులు దుర్వినియోగానికి పాల్పడిన సదాశివనగర ఎంపీడీవో విజయ్‌కుమార్,ఇంజినీరింగ్ కన్సల్టెంట్ రాధిక, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. సదాశివనగర్ మండలం మర్కల్, కుప్రియాల్ గ్రామాల నర్సరీలకు సంబంధించి నిధులు దుర్వినియోగం జరిగాయని ఆయా గ్రామాల వారి ఫిర్యాదు మేరకు కలెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన విచారణలో రూ.79 వేల 500 నిధులు దుర్వినియోగం అయినట్లు తేలడంతో ముగ్గురిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Related Stories: