పత్రికకు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో

నటనలోనే కాదు మంచి వ్యక్తిత్వం, నడవడిక, సేవాగుణంలోను సూర్య ఎప్పుడు నెంబర్ వన్ అని అందరు నమ్ముతారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ ప్రక్కవారిని హ్యపీగా ఉంచే సూర్య ఈ మధ్య ఓ పత్రిక ప్రచురించిన కథనానికి ఫైర్ అయి వార్నింగ్ కూడా ఇచ్చాడట. అసలు విషయానికి వస్తే ..ఇటీవల ఓ మతపరమైన సంస్థ తమ కార్యక్రమంలో పాల్గొనడానికి సూర్యను ఆహ్వనించిందని, అందుకోసం సూర్య కాస్త రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు మలేషియా పత్రిక కథనం రాసిందట. ఈ విషయం తెలుసుకున్న సూర్య.. తను ఇంతవరకు మత పరమైన కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్లొనలేదు, పాల్గొనబోను కూడా అని స్ట్రైట్‌ ఆన్సర్ ఇచ్చాడు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఇలాంటి నిరాధార వార్తలు రాస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ సదరు పత్రికకు సూర్య వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Related Stories: