వ‌రుస సినిమాల‌తో బిజీ అయిన త‌మిళ స్టార్ హీరో

త‌మిళంలోనే కాక తెలుగులోను మంచి క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో సూర్య. న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గాను సూర్య రాణిస్తున్నాడు. ప్ర‌స్తుతం సెల్వరాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌జీకే అనే చిత్రం చేస్తున్న సూర్య త‌న 37వ చిత్రంగా కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని లైకా సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప‌ట్టుకొట్టై ప్ర‌భాక‌ర్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొంద‌నుందని స‌మాచారం. కేవీ ఆనంద్, సూర్య కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అయన్‌, మాట్రాన్ చిత్రాలకి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌గా, త్వ‌ర‌లో తెర‌కెక్క‌నున్న మూవీ కూడా హిట్ సాధిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. సూర్య 37వ చిత్రానికి హ‌రీష్ జై రాజ్ సంగీతం అందించ‌నున్నాడు. ఇక సూర్య‌ తన 38వ సినిమాను కూడా లైన్లో పెట్టేశాడని తెలుస్తోంది. తమిళంలో ఇరుదు సుట్రుతో హిట్ కొట్టి .. గురు పేరుతో తెలుగులో రీమేక్ చేసిన సుధా కొంగర, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. జీవీ ప్రకాశ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. సూర్య 39వ చిత్రం మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనో లేదంటే హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో కాని ఉండ‌నుంద‌ని టాక్‌. ఇదిలా ఉంటే త‌న త‌మ్ముడు ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు సూర్య‌.
× RELATED బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు