ఒక రాష్ట్రం.. ఒక ఓటు రూల్ కొట్టేసిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్‌ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు ఊరట కలిగించే తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. గతంలో తాను ఇచ్చిన తీర్పును మారుస్తూ.. ఒక రాష్ట్రం.. ఒక ఓటు నిబంధనను కొట్టేసింది. అంతేకాదు ముంబై, సౌరాష్ట్ర, వడోదర, విదర్భ క్రికెట్ అసోసియేషన్‌లకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించింది. ఇక కొన్ని తప్పనిసరి మార్పులతో బీసీసీఐ ముసాయిదా రాజ్యాంగాన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆమోదించింది. రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీస్‌కు గతంలో ఉన్న శాశ్వత సభ్యత్వాన్ని కూడా కోర్టు పునరుద్ధరించింది. ఇక 30 రోజుల్లోపే బీసీసీఐ రాజ్యాంగాన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లన్నీ అమలు చేయాలని స్పష్టంచేసింది. ఒకవేళ అలా చేయలేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక బీసీసీఐలో వరుసగా రెండుసార్లు పదవులు చేపట్టే ముందు కచ్చితంగా మధ్యలో కొంత సమయం బోర్డుకు దూరంగా ఉండాలన్న నిబంధనను అమలు చేయాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.

Related Stories: