17 వరకు గృహనిర్బంధం పొడిగింపు

న్యూఢిల్లీ: బీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అయిదుగురు పౌర హక్కుల నేతలు గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ అయిదుగురి గృహనిర్బంధాన్ని ఈనెల 17 వరకు పొడిగించారు. హౌజ్ అరెస్టును పొడిగిస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీమాకోరేగావ్ కేసులో దేశవ్యాప్తంగా అయిదుగురు నేతలను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావును కూడా హౌజ్ అరెస్టు చేశారు. మావోలతో లింకున్న కేసులో గత నెలలో పుణె పోలీసులు ఆ అయిదుగుర్ని అరెస్టు చేశారు. అరెస్టులను సవాల్ చేస్తూ రోమిలా థాపర్ సుప్రీంలో కేసు వేశారు. వెర్నాన్ గొంజాలెజ్, అరుణ్ ఫెరీరా, సుదా భరద్వాజ్, గౌతమ్ నవలఖాలను పోలీసులు అరెస్టు చేశారు. అయిదుగురి ఇండ్ల నుంచి కూడా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.

Related Stories: