స్వలింగ సంపర్కులకు సంపూర్ణ స్వేచ్ఛ

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కం నేరం కాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు. భార‌తీయ శిక్షాస్మృతిలోని(ఐపీపీ) సెక్షన్ 377పై దాఖలైన పిటీషన్లపై అయిదుగురు సభ్యులు ధర్మాసనం విచారణ చేపట్టింది. అంగీకారంతో ఇద్దరు పెద్దల మధ్య జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని, సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కులకు శిక్షను విధించలేమని దీపక్ మిశ్రా తెలిపారు. ఎల్‌జీబీటీ హక్కులను సుప్రీంకోర్టు గౌరవిస్తుందన్నారు. సెక్షన్ 377కు సంబంధించిన తీర్పును దీపక్ మిశ్రా చదివి వినిపించారు. సాధారణ పౌరులకు ఉండే హక్కులే.. ఎల్‌జీబీటీ వర్గానికి చెందిన వారికి వర్తిస్తాయని సుప్రీం తేల్చింది. సమాజంలో ఉన్న కొన్ని రుగ్మతలు కొందర్నీ వేధిస్తున్నాయని, ప్రగతిపథంలో నడిచేవారు అందర్నీ ఆహ్వానించాలని చీఫ్ జస్టిస్ అన్నారు. వ్యక్తుల్లో ఉన్న భిన్నత్వాన్ని గౌరవించాలన్నారు. అయితే జంతువులతో జరిగే సంపర్కాన్ని మాత్రం సుప్రీం నేరంగా పరిగణిస్తూ తీర్పునిచ్చింది.

Related Stories: