ఫీల్డింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. కోల్‌కతా జట్టులో భారీ మార్పులు

హైదరాబాద్‌: ఉప్పల్‌ మైదానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలో దిగుతోంది. మరోవైపు కోల్‌కతా మేనేజ్‌మెంట్‌ రాబిన్‌ ఉతప్ప, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణలను తప్పించింది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జైత్రయాత్రకు బ్రేకులు వేసిన హైదరాబాద్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు కోల్‌కతా నెగ్గిన 4 మ్యాచ్‌లూ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ మెరుపుల వల్లే గెలిచింది. సన్‌రైజర్స్‌ టీమ్‌లో ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టోలు నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

Related Stories: