టుస్సాడ్స్‌లో స‌న్నీ మైన‌పు విగ్ర‌హం

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల మైనపు విగ్రహాలు కొలువుదీరిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, షారుక్‌ ఖాన్‌ తదితరుల విగ్ర‌హాలు టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయ‌గా, ఇప్పుడు సన్నీ లియోన్ మైన‌పు మిగ్ర‌హాన్ని టుస్సాడ్స్‌లో మ్యూజియంలో నెల‌కొల్పారు. స‌న్నీ త‌న విగ్ర‌హాన్ని తానే ఆవిష్క‌రించుకుంది. మ‌త్తేక్కించే అందాల‌తో మ‌తులు పోగోట్టే స‌న్నీలియోన్ .. ప్రసిద్ధమైన మేడం టుసాడ్ మ్యూజియంలో తన బొమ్మను తానే చూసుకోవడం అద్భుతుమైన అనుభూతిని కలిగించిందని సన్నీ ఆనందం వ్యక్తం చేసింది. సన్నీ భర్త డేనియల్ వెబర్ కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఇటీవలే కొత్త ఇంటికి మారిన సన్నీ దంపతులు వినాయక చవితిని ప్రత్యేకంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం స‌న్నీ సౌత్ లో చారిత్రాత్మ‌క చిత్రం చేస్తుండ‌గా, మ‌రోవైపు ఆమె జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన క‌ర‌ణ్‌జిత్ కౌర్ వెబ్ సిరీస్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Related Stories: