నిశ్చితార్థం రద్దు నిజమేనట..!

ఛలో, కిరాక్ పార్టీ, గీత గోవిందం చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి రష్మిక మందన్నా. ఈ హీరోయిన్ నిశ్చితార్థం కోస్టార్, నటుడు రక్షిత్‌శెట్టితో గతేడాది జరిగిన విషయం తెలిసిందే. రష్మిక, రక్షిత్‌శెట్టిల నిశ్చితార్థం రద్దయినట్లు ఇప్పటికే ఊహాగానాలు, వార్తలు చక్కర్లు కూడా కొట్టాయి. కెరీర్ దూసుకెళ్తున్న సమయంలో పెళ్లి విషయాన్ని పక్కనపెట్టాలని రష్మిక భావించినట్లు గాసిప్స్ వచ్చాయి.

అయితే తాజాగా వీరి రిలేషన్‌షిప్‌పై రష్మిక తల్లి సుమన్ మందన్నా స్పష్టత ఇచ్చారు. ఇటీవలే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్క్యూలో తన కూతురు రష్మిక నిశ్చితార్థం రద్దయిందని, ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తాము కొంత ఇబ్బందికి లోనయ్యామని, ప్రస్తుతం దాని నుంచి కోలుకుంటున్నామని సుమన్ తెలిపారు.

× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..