‘సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు’

హైదరాబాద్ : ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని పలువురు వక్తలు అన్నారు. ఆత్మహత్య మరొక సమస్యకు దారి తీస్తుందని చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి బతికి సాధించుకోవాలని సూచించారు. ఆయిస్టర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఆత్మహత్యల నివారణపై అవగాహనా సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సదస్సుకు గాంధీ మెడికల్ కళాశాల సైకియాట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. శ్రీలక్ష్మి, రోషిణి కౌన్సిలింగ్ సెంటర్ నిర్వాహకురాలు స్వర్ణరాజ్, ఓయూ సైకాలజీ విభాగం హెడ్ డాక్టర్ స్వాతి తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో చాలావరకు యువత మానసిక దిగ్భ్రాంతికి లోనవుతున్నారని చెప్పారు. దాంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలు రోడ్డు పాలయ్యే అవకాశాలు అధికమని అభిప్రాయపడ్డారు. ఆత్మహత్యలను నివారించేందుకు తగిన అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Related Stories: