కేర‌ళ‌కి 80నాటి తార‌ల ఆర్ధిక సాయం

ఇటీవల కురిసిన భారీ వ‌ర్షాల‌కి కేర‌ళ రాష్ట్రం అత‌లాకుత‌లం అయిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద‌ల వ‌ల‌న ఎందరో నిరాశ్ర‌యుల‌య్యారు. వారిని ఆదుకునేందుకు సినీ, రాజ‌కీయ‌, క్రీడా రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు విరాళాలు ఇచ్చారు. తాజాగా 1980 కాలం నాటి ద‌క్షిణ సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన తార‌లంతా 80 రీయూనియ‌న్ పేరుతో విరాళాలు సేకరించి వ‌చ్చిన మొత్తాన్ని కేర‌ళ ముఖ్య‌మంత్రికి అందించారు. 40 లక్షల రూపాయల విరాళం అందజేశామని సీనియర్‌ హీరోయిన్‌ సుహాసిని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సీఎంని క‌లిసిన స‌మ‌యంలో అలనాటి హీరోయిన్లు కుష్బు , లిజీ కూడా ఉన్నారు . 80's సౌత్‌ యాక్టర్స్‌ రీ-యూనియన్‌' ఆధ్వర్యంలో స్నేహితులు, బంధువుల నుంచి కూడా విరాళాలు సేకరించామని నటి లిజి మీడియాకు తెలిపారు. గాడ్స్‌ ఓన్‌ కంట్రీ వాసులు పూర్తిగా కోలుకునేలా తమ వంతు సహాయాన్నందించేందుకు నిర్ణయించామని నటి కుష్బు తెలిపారు. ఆప‌ద స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతుగా సాయం చేయ‌డంపై కేర‌ళ సీఎం హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Related Stories: