గ్రాండ్‌గా లాంచ్ అయిన‌ సుధీర్ బాబు కొత్త చిత్రం

ఇటీవ‌ల స‌మ్మోహ‌నం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన సుధీర్ బాబు ప్ర‌స్తుతం నన్ను దోచుకుందువ‌టే సినిమా చేస్తున్నాడు. ఆర్ ఎస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ కాస్త డిఫ‌రెంట్ మెంటాలిటీ ఉన్న మేనేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, హీరోయిన్ న‌బా న‌టేష్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా క‌నిపించనుంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా సుధీర్ బాబు మ‌రో మూవీ ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. పులి వాసి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన్ సంస్థ నిర్మించ‌నుంది. ఎస్ ఎస్ థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ప‌ర‌చూరి గోపాల‌కృష్ణ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు చిత్ర ప్రారంభోత్స‌వం కార్య‌క్రమానికి హాజ‌ర‌య్యారు.దిల్ రాజు క్లాప్ కొట్ట‌గా, ఫ‌స్ట్ షాట్‌ని వివి వినాయ‌క్ డైరెక్ట్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?