ఈసారైనా న్యాయం చేయాలె

కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో భాగంగా తెలంగాణ సర్కారు గురుకులాలను ప్రారంభించడం అభినందనీ యం. ఇందులో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని నిర్ణయించడం హర్షనీయం. అయితే, వీటితోపాటు మోడల్ స్కూల్స్, ఇతర పాఠశాలల్లో టీచర్ల ఎంపికలో ఇంటర్ టు బీఈడీ, పీజీ స్థాయిలో పూర్తిగా తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారికి తప్పకుండా అవకా శం కల్పించాలి. ప్రస్తుతం పోటీలో(నిరుద్యోగిత) వారి సంఖ్యనే అధికంగా ఉన్నది. ఓ పదిహేనేళ్లు వెనక్కిపోతే మన విద్యావ్యవస్థ అంతా తెలుగు మాధ్యమంలోనే సాగింది. మెజార్జీ ప్రజలు తెలుగు మీడియంలో చదివినవారే. అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేకపోవడం, పల్లెటూర్లలో ఎక్కువ కుటుంబాలు కార్పొరేట్ బళ్లలో చదువుకొనలేకపోవడంతో మాతృభాషలోనే విద్యనభ్యసించారు. ఇంగ్లీష్ మాట్లాడటంలో ప్రైవేట్‌లో చదువుకున్నవారితో చూస్తే కొంత వెనుకబడ్డా వీరికి విషయ పరిజ్ఞా నం అపారం. 2012లో మోడల్ స్కూల్లో నియామకాల కోసం నోటిఫికేషన్ జారీచేసిన అప్పటి సర్కారు ఇంటర్ నుం చి ఏదైనా రెండు స్థాయిల్లో ఇంగ్లీష్ మీడియం చదివిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నది. దీంతో చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులకు నిరాశనే ఎదురైంది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజా సర్కారు (టీఆర్‌ఎస్)లో గతంలో జరిగిన మాదిరి అన్యాయం జరుగదని తెలుగు మీడియం విద్యార్థులు భావిస్తున్నారు. ఇప్పటి కే ప్రభుత్వంపై నమ్మకంతో కోచింగులకు కూడా వెళ్తున్నారు. టీచర్‌గా ఎంపికైన తర్వాత తమకు ఇంగ్లీష్ శిక్షణనిస్తే చిత్తశుద్ధితో నేర్చుకొని, విద్యార్థులకు ఉన్నతం గా బోధిస్తారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఈసారి తెలుగు మీడియం విద్యార్థులకు కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. - రాజు అతికం, కరీంనగర్ మొక్కలను సంరక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. అయితే ఇదే స్ఫూర్తిని మొక్కల సంరక్షణలోనూ చూపెట్టాలి. ఎందుకంటే చాలాచోట్ల రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటారు. వాటికి సరైన రక్షణ లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నది. కాబట్టి మొక్కల సంరక్షణ కోసం ఆయా మున్సిపాలిటీలు ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయాలి. అలాగే అవి పెరిగే వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి. భవిష్యత్తు తరాల వారికి మంచి పర్యావరణాన్ని అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేయాల్సిన బాధ్య త పౌర సమాజంపై ఎక్కువగా ఉన్నది. అలాగే పర్యా వరణ పరిరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం వచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. దీకోసం ప్రచార, ప్రసార మాధ్యమాలను ప్రభుత్వాలు ఉపయోగించు కోవాలె. - టి.కుమార్, హైదరాబాద్