ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్ప‌బోతున్న అన్న‌ద‌మ్ములు..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో తెర‌కెక్కిన చాలా చిత్రాల‌కి ఫైటింగ్స్ అద‌న‌పు బ‌లం అనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. హీరో స్టైల్‌కి త‌గ్గ‌ట్టు ఫైట్స్ ని అద్భుతంగా డిజైన్ చేసి ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్ టైన్ చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ ల‌క్ష్మణ్‌లు. వారు అతి త్వ‌ర‌లో సినీ ప‌రిశ్ర‌మ‌కి గుడ్ బై చెప్పాల‌నుకుంటున్నార‌ట‌. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించిన వీరు 1987లో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. మొద‌ట చెన్నై వెళ్లిన వీరు 2009 వ‌ర‌కు ఫైట్ మాస్టర్స్‌కి అసిస్టెంట్స్‌గా పని చేశారు. ఇక 2001లో సినీ ప‌రిశ్ర‌మ చెన్నై నుండి హైద‌రాబాద్‌కి రావ‌డంతో వారు హైద‌రాబాద్‌లోనే స్థిర‌ప‌డ్డారు. 31 ఏళ్ళ‌లో వారిద్ద‌రు క‌లిసి 1100 సినిమాల‌కి పైగా ఫైట్ మాస్ట‌ర్స్‌గా ప‌నిచేశారు. భార‌తీయ భాష‌ల‌కి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళం, హిందీ సినిమాల‌న్నింటికి వీరు ప‌నిచేశారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, గబ్బర్‌సింగ్‌, ఖైదీనెంబర్‌ 150 సినిమాలు త‌మ‌కు గుర్తింపు తెచ్చాయన్నారు. త్వ‌ర‌లోనే తాము ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెబుతున్నామ‌ని రామ్ ల‌క్ష్మ‌ణ్‌లు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. సినిమాలు మానేసిన త‌ర్వాత ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగించాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు రామ్‌ల‌క్ష్మ‌ణ్ అన్నారు. తాము పుట్టి పెరిగిన కారంచేడులో చిన్న చిన్న సేవా కార్య‌క్ర‌మాలు చేయాల‌ని తాము భావిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమాతో పాటు చిరు 151వ చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి చిత్రానికి తాము ప‌నిచేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. తమకు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అని వారు ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.

Related Stories: