ఫణిగిరిలో బయల్పడ్డ వింత సమాధులు

నాగారం : తవ్వకాల్లో వింత సమాధులు బయల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో సాయంత్రం చోటు చేసుకుంది. ఫణిగిరి గ్రామంలోని గౌడ సంఘం నాయకులు కంఠహేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి పిల్లర్ గుంతల తవ్వకాలు జరుపుతుండగా ఓ వింత సమాధి బయపడింది. దీంతో గౌడ సంఘం నాయకులు ఇది పురావస్తుదేమోనని భావించి పురావస్తుశాఖ అధికారులకు సమాచారం అందించారు. తవ్వకాల్లో బయటపడిన సమాధుల్లో నాలుగు వైపులా పేర్చిన రాళ్ళు, కుండ, గాజుపెంకులు బయటపడ్డాయి.

దీంతో పురావస్తుశాఖ ఏడీ బుజ్జిని ఫోన్‌లో సంప్రదించగా సమాధి ఆకారాన్ని బట్టి చూస్తే ఈ సమాధి పురాతనమైంది కాదని, సుమారు 20 -30 సంవత్సరాల కిందటిదని తెలిపారు. గ్రామస్తులు ఇక్కడ బౌద్ధక్షేత్రం ఉండడంతో ఈ సమాధి కూడా పురావస్తుదేమోనని చాలా మంది చూసేందుకు వచ్చారు. పురావస్తుశాఖ అధికారులు పురాతనమైనదని కాదని, అయినప్పటికీ తాము వచ్చి సందర్శించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

× RELATED ఆధార్ కార్డ్ ఉంటే చాలు నేపాల్, భూటాన్ వెళ్లొచ్చు!