తేరుకున్న మార్కెట్

రూపాయి రికవరీకి తోడు ఎఫ్‌ఎంసీజీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో వచ్చిన ర్యాలీతో స్టాక్ మార్కెట్ కోలుకుంది. రూపాయి అసాధారణ స్థాయికి పతనం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదనీ ప్రకటించడంతో పాటు ఈ వారాంతంలో ప్రధాని ఆర్థిక వ్యవస్థ పనితీరును సమీక్షిస్తారన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. మధ్యాహ్నం వరకు స్వల్ప లాభానష్టాలతో ఊగిసలాడిన మార్కెట్ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారి భారీ లాభాలతో పరుగులు పెట్టింది. సెన్సెక్స్ 304.85 పాయింట్ల లాభంతో 37,717.96 వద్ద ముగిసింది. కాగా, నిఫ్టీ 82.40 పాయింట్ల లాభంతో 11,369.90 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ రూ. 72.91ల కనీస స్థాయికి పతనం అయిన తర్వాత ప్రభుత్వ ప్రకటనతో ఒక్కసారిగా రూపొయి పైగా రికవరీ అయింది.

మరో దేశీయ ఎగుమతులు ఆగస్టు నెలలో 19.21 శాతం పెరిగి 27.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్న వార్తలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు భారీ లాభంతో ముగిసాయి. దీంతో ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 2.53 శాతం లాభపడింది. ఆ తర్వాత మెటల్ ఇండెక్స్ 1.48 శాతం, ఫార్మా ఇండెక్స్ 1.09 శాతం లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్ 0.38 శాతం లాభపడగా, ఆటో ఇండెక్స్ 0.11 శాతం లాభపడింది. రియాల్టీ ఇండెక్స్ 0.62 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం నష్టాలతో ముగిసాయి. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 1079 షేర్లు నష్టాలతో ముగిస్తే 716 షేర్లు లాభాలతో ముగిసాయి.

Related Stories: