రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం

Swimming-competition వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ ఈత పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హన్మకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్ పూల్‌లో ఏర్పాటు చేసిన పోటీల్లో అన్ని జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.