రాష్ట్రస్థాయి వాలీబాల్ విజేత పాలమూరు

వర్గల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం నాచగిరిగుట్ట వద్ద మూడు రోజులుగా జరిగిన అండర్-14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ శనివారంతో ముగిసింది. పాత పది జిల్లాల ప్రకారం బాలికలు, బాలుర విభాగాల్లో మొత్తం 20 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. బాలికల ఫైనల్లో నల్లగొండ 3-1 తేడాతో రంగారెడ్డిపై గెలిచింది. బాలుర తుది పోరులో పాలమూరు జట్టు 2-1 తేడాతో నిజామాబాద్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గెలుపొందిన విజేతలకు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంతరెడ్డి, జిల్లా వాలీబాల్ ఉపాధ్యక్షులు కొన్యాల రాజిరెడ్డి, సెక్రటరీ నర్సింహులు, క్రీడా ఆర్గనైజింగ్ సెక్రటరీ సుల్తాన్, మాజీ సర్పంచ్‌లు యాదగిరిగౌడ్, గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories: