శ్రీశైలానికి 37వేల క్యూసెక్కుల వరద

అమ్రాబాద్ రూరల్: ఎగువ నుంచి శ్రీశైలానికి సోమవారం రాత్రి 9 గంటలకు 37,288 క్యూసెక్కుల వరద వస్తుండగా, వివిధ ప్రాజెక్టులకు 89,752 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.807 టీఎంసీలు) కాగా 879.70 అడుగులు (186.4214 టీఎంసీలు)గా నమోదైంది.

జూరాలకు తగ్గుతున్న ఇన్‌ఫ్లో..

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జూరాలకు క్రమంగా వరద ప్రవాహం తగ్గుతున్నది. సోమవారం రాత్రి 9 గంటలకు జూరాలకు ఇన్‌ఫ్లో 13 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 43,622 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1,044.849 అడుగుల ఎత్తులో 9.562 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 18,900 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 18,900 క్యూసెక్కులు, నారాయణపూర్ ఇన్‌ఫ్లో 18,080, ఔట్‌ఫ్లో 16,790 క్యూసెక్కులు, తుంగభద్ర ఇన్‌ఫ్లో 7,921, ఔట్ ఫ్లో 11,038 క్యూసెక్కులు నమోదైంది.

సాగర్‌కు వరద నిల్..

నందికొండ: నాగార్జునసాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. సాగర్ నుంచి మొత్తంగా 19,281 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు(312.05 టీఎంసీలు)గాను సోమవారం నాటికి 587.80 (305.8818 టీఎంసీలు) అడుగులకు చేరుకున్నది.

పోచంపాడ్‌లో విద్యుత్ ఉత్పత్తి..

మెండోరా: ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. కాగా ప్రాజెక్ట్ నుంచి 7,260 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1086.30 అడుగుల( 70.990 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది. కాకతీయ కాల్వకు 5,500 క్యూసెక్కులు వదులుతుండటంతో పోచంపాడ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని ఇంచార్జి ఎస్‌ఈ శ్రీనివాస్ తెలిపారు.