నాని-నాగ్ మూవీపై వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించిన ద‌ర్శ‌కుడు

నాని, నాగ్ కాంబినేష‌న్‌లో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం కోసం స్పెష‌ల్‌గా వేసిన‌ కాల‌నీ సెట్‌లో ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్నట్టు తెలుస్తుంది. నాని స‌ర‌స‌న ఛ‌లో ఫేం రష్మిక మందాన, నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ మూవీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. ఇందులో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తే, నాని డాక్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రం వినాయ‌క చివితి శుభాకాంక్ష‌ల‌తో సెప్టెంబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల కానుందని అంటున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ మూవీకి రీమేక్ అంటూ కొన్నాళ్ళుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన ద‌ర్శ‌కుడు ఈ మూవీ ఏ చిత్రానికి రీమేక్ కాదు. ఒరిజిన‌ల్ స్క్రిప్ట్‌తో తెర‌కెక్కిస్తున్నాయ‌ని క్లారిటీ ఇచ్చాడు. దీంతో రూమ‌ర్స్‌కి బ్రేక్ ప‌డింది.

× RELATED కివీస్ కెప్టెన్ ఒంట‌రి పోరాటం