ఇష్టదైవాలకు మొక్కి..ఆశీర్వాదాలు తీసుకుని!

-మంచిరోజు కావడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులు -బుధవారం ఒక్కరోజే భారీగా దాఖలైన నామినేషన్లు
నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్: బుధవారం మంచిరోజు కావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు శాసన సభ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. అధినాయకత్వం అందజేసిన బీఫాంలతో పూజలు చేసి కొందరు.. ఇష్టదైవాలకు ప్ర త్యేక పూజలు చేసి మరికొందరు.. కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుని ఇంకొందరు నామినేషన్లు దాఖలు చేశారు. కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు వెంటరాగా అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు, ఖానాపూ ర్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి రేఖానాయక్ నామినేషన్లు వేశారు. ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కోవ లక్ష్మి, బీఎస్పీ తరఫున ఒకరు, సిర్పూర్‌లో కాంగ్రెస్, బీఎల్పీ, స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కొక్కరు నామినేషన్లు వేశా రు. మంచిర్యాలలో బీఎల్‌ఎఫ్-1, బీఎస్పీ-1, శివసేన -1, స్వతంత్ర-1, చెన్నూర్‌లో టీఆర్‌ఎస్-1, కాంగ్రె స్-1, బీజేపీ-1, జైస్వరాజ్ పార్టీ-1, న్యూ ఇండియా పార్టీ-1, ఆర్‌పీఐ-1, స్వతంత్ర-2, బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్-1, బీఎల్‌ఎఫ్-1, యూసీసీఆర్‌ఎంఎల్-1 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీఆర్‌ఎస్ నుంచి దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), బాల్క సుమన్(చెన్నూర్) నామినేషన్లు దాఖలు చేశారు.

నిర్మల్ జిల్లాలో..

నిర్మల్ జిల్లా ముథోల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ నామినేషన్లు దాఖలు చేశారు. నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి గా సువర్ణారెడ్డి నామినేషన్ వేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ అర్బన్ బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా ఇస్మాయిల్ మహ్మద్, బీఎస్పీ నుంచి రాచమల్లు రమేశ్, ఆర్మూర్‌లో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింధూకర్ చరణ్‌కుమార్, బోధన్‌లో శివసేన అ భ్యర్థిగా పసులోటి గోపీకిషన్ నామినేషన్ వేశారు. కా మారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, బీజేపీ అభ్య ర్థి వెంకటరమణరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మల్యాద్రిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జుక్కల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే తరఫున ఆయన సతీమణి శోభావతి, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ గంగారాం, స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాశ్ నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తరఫున ఆయన సోదరుడైన మ హేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా వీ శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్ అ భ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట అభ్యర్థి రాజేందర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. మహబూబ్‌నగర్ టీడీపీ అభ్యర్థిగా చంద్రశేఖర్, ఎం భవానీ, బీజేపీ అభ్యర్థులుగా పద్మజారెడ్డి, పడాకుల బాల్‌రాజ్, ఆమ్‌ఆద్మీ తరఫున బాబుల్‌రెడ్డి నామినేషన్లు వేశారు. దేవరకద్ర టీడీపీ అభ్యర్థిగా సీతా దయాకర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఎగ్గని నర్సింహులు, బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా రాములు, ఇండిపెండెంట్‌గా బుడగ జంగం శ్రీనివాసులు, అ జ్జకోలు కిరణ్‌కుమార్ నామినేషన్లు వేశారు. నారాయణపేట బీజేపీ అభ్యర్థిగా రతంగ్ పాండురెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా శివకుమార్‌రెడ్డి నామినేషన్లు వే శారు. జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉమ్మడి ఆనంద్, ద్యా ప రాంబాబురెడ్డి నామినేషన్లు వేశారు. మక్తల్‌లో టీ డీపీ అభ్యర్థిగా కొత్తకోట దయాకర్‌రెడ్డి, బీఎస్‌పీ అభ్యర్థిగా కోరె మారెప్ప నామినేషన్లను వేశారు.

నాగర్‌కర్నూల్‌లో..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి మల్లేశ్వర్ నామినేషన్లను దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి త ల్లోజు ఆచారి, ఎన్‌సీపీ అభ్యర్థి శ్రీకాంత్, ఇండిపెండెం ట్ అభ్యర్థి చీమర్ల అర్జున్‌రెడ్డి అధికారులకు నామినేష న్లు సమర్పించారు. గద్వాల టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి వెంకటాద్రిరెడ్డి, అలంపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి అబ్రహం, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ నామినేషన్లు వేశారు. వనపర్తి టీఆర్‌ఎస్ అభ్య ర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా బూజుల వెంకటేశ్వర్‌రెడ్డి నామినేషన్ వేశారు. తాండూర్ కాంగ్రె స్ అభ్యర్థిగా పైలట్ రోహిత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రవిశంకర్‌పటేల్, పరిగి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొప్పుల మ హేశ్‌రెడ్డి, కొడంగల్ అభ్యర్థిగా పట్నం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి తరఫున ఆయన సోదరు డు తిరుపతిరెడ్డి నామినేషన్లు వేశారు. వికారాబాద్ కాం గ్రెస్ అభ్యర్థిగా ప్రసాద్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థులుగా చంద్రశేఖర్, వడ్ల నందు, గంగాభవానీ నామినేషన్లు వేశారు.

కరీంనగర్‌లో..

కరీంనగర్ హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేంద ర్ తరఫున ఆయన సతీమణి జమున నామినేషన్ వేశా రు. కరీంనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థి బం డి సంజయ్, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పా డి కౌశిక్‌రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా కటంగురి బుచ్చిరెడ్డి, బీజేపీ తరఫున ఉప్పు రవీందర్, ఎంసీపీఐ (యూ) అభ్యర్థిగా లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థిగా గుర్రం వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు. మానకొండూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ మోహన్, బీజేపీ అభ్యర్థిగా జీ నాగరాజు, చొప్పదండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సుంకె రవిశంకర్, బీ జేపీ అభ్యర్థిగా బొడిగ శోభ నామినేషన్లు వేశారు. రాజ న్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీహెచ్ రమేశ్‌బాబు, కాంగ్రెస్ అభ్యర్థిగా కేకే మహేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మల్లుగారి నర్సాగౌడ్, తెలుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీకటి వరుణ్‌కుమార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశా రు. జగిత్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్, కో రుట్ల అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నిజామాబా ద్ ఎంపీ కవితతో కలిసి నామినేషన్లు వేశారు. ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. జగిత్యాల బీజేపీ అభ్యర్థి ముదుగంటి రవీందర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఆకుల శ్రీకాంత్‌కుమార్, ధర్మపురి బీజేపీ అభ్యర్థి క న్నం అంజయ్య నామినేషన్లు వేశారు.

డిప్యూటీ సీఎం కడియం, ఎమ్మెల్సీ పల్లాతో కలిసి..

జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థి యాదగిరిరెడ్డి, ఎమ్మె ల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి నామినేషన్ వేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య.. డిప్యూటీ సీఎం కడియం శ్రీహ రి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. జనగామ స్వతంత్ర అభ్యర్థిగా మేరుగు శ్రీనివాస్ నామినేషన్ వేశారు. మహబూబాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్, డోర్నకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాంనాయక్, స్వతంత్ర అభ్యర్థిగా డీఎస్ నారాయణసింగ్, డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థిగా జాటోత్ రామచంద్రునాయక్ నామినేషన్లు వేశా రు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట టీఆర్‌ఎస్ అభ్య ర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్ నామినేషన్లు వేశారు. పెద్దపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దాసరి మనోహర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయరమణారావు, కాంగ్రెస్ రెబల్‌గా గొట్టెముక్కల సురేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల రా మకృష్ణారెడ్డి, దాసరి పుష్పలత నామినేషన్లు వేశారు. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థిగా మక్కాన్‌సింగ్, ఏఎఫ్‌బీ అభ్యర్థిగా కోరుకంటి చందర్, మంథని కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీధర్‌బాబు, మరో ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక బీజేపీ అభ్యర్థిగా చందా సంతోశ్, కాంగ్రెస్ అభ్యర్థిగా రేగా కాంతారావు, స్వతంత్ర అభ్యర్థిగా పాల్వంచ దుర్గ నామినేషన్లు దాఖ లు చేశారు. ఇల్లెందు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కోరం కనక య్య, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థిగా గుమ్మడి నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా హరిప్రియ, లకావత్ దేవీలాల్ నామినేషన్లు దాఖలు వేశారు. కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, అ శ్వారావుపేట టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) తరఫున తానం రవీందర్, బీజేపీ నుంచి భూక్యా ప్రసాదరావు, స్వతంత్ర అభ్యర్థి భూక్యా ఉదయజ్యోతి, భద్రాచలం స్వతంత్ర అభ్యర్థి గుండా శరత్‌బాబు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఖమ్మం జిల్లా మధిర టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు, సత్తుపల్లి బీజేపీ అభ్యర్థిగా నంబూరి రామలింగేశ్వరరావు, పాలేరు బీజేపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, వైరా బీజేపీ అభ్యర్థిగా రేష్మారాథోడ్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా వరస రాములు నామినేషన్లు వేశారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోము ల నర్సింహయ్య, నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం, మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మిర్యాలగూడ అభ్యర్థి నలమోతు భాస్కర్‌రావు, నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి నామినేషన్ వేశారు. నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, దేవరకొండలో టీడీపీ అభ్యర్థి నేనావత్ బిచ్యానాయక్, స్వతంత్ర అభ్యర్థి రమావత్ భోజ్యానాయక్ నామినేషన్లు వేశారు. నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, స్వ తంత్ర అభ్యర్థిగా చెన్నెని జానయ్య నామినేషన్ వే య గా.. మిర్యాలగూడలో సీపీఎం అభ్యర్థి జూలకంటి రం గారెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా డబ్బీకార్ మల్లేశ్, డీ ఉష్యానాయక్, పల్లపు భిక్షపతి నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా మీనయ్య, బీఎస్పీ అభ్యర్థిగా బోల్ల వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో నాలుగు చొప్పున, కోదాడ, హుజూర్‌నగర్‌లలో మూ డు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. తుంగతుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్ తుంగతుర్తి తహసీల్దా రు కార్యాలయంలో నామినేషన్ వేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టీఆర్‌ఎస్ అ భ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరు అభ్యర్థ్ధి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి, హుస్నాబాద్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ నామినేషన్లు వేశారు. గజ్వేల్‌లో బీజేపీ నుంచి ఎన్ శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేశ్వర్లు, సిద్దిపేటలో బీజేపీ నుంచి నాయిని నరోత్తంరెడ్డి, టీడీపీ నుంచి గుండు భూపేందర్, స్వతంత్ర అభ్యర్థి బోగి శ్రీనివాస్, దుబ్బాకలో టీజేఎస్ అభ్యర్థిగా చిందం రాజ్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా మహమద్ ఖాసీం, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి, శివసేన అభ్యర్థిగా మాధవరెడ్డిగారి హన్మంతరెడ్డి నామినేషన్లు వేశారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. షాద్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్, ఇబ్రహీంపట్నం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తరుఫున ఆయన సతీమణి ముకుందమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సునితారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సింగాయిపల్లి గోపి, మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పీ శశిధర్‌రెడ్డి నామినేషన్ వేశారు.